News December 20, 2025

యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: భువనగిరి కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ (సోమవారం) నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.

Similar News

News January 1, 2026

భద్రాద్రి: బొకేలు వద్దు.. నోటు పుస్తకాలే ముద్దు: కలెక్టర్

image

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన, ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. వృథా ఖర్చులకు బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటి విద్యా సామగ్రిని అందజేయాలని కోరారు.

News January 1, 2026

అసభ్యంగా తాకేందుకు ప్రయత్నిస్తే బూటుతో కొట్టా: బ్రిటన్ రాణి

image

టీనేజీలో తనకు ఎదురైన అనుభవాన్ని బ్రిటన్ రాణి కెమిల్లా తాజాగా పంచుకున్నారు. ‘16-17 ఏళ్ల వయసులో నేను లండన్‌లో రైలులో వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకోవడంతో నాపై దాడి చేశాడు. నేను బూటు తీసి కొట్టాను. మహిళలపై జరుగుతున్న హింస ఎంత పెద్ద సమస్యో తెలియజేసేందుకే ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా’ అని ఓ రేడియో ఇంటర్వ్యూలో కెమిల్లా తెలిపారు.

News January 1, 2026

సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం?

image

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.