News December 20, 2025
యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం: భువనగిరి కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీ (సోమవారం) నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు.
Similar News
News December 27, 2025
కబడ్డీలో కరీంనగర్ జైత్రయాత్ర

ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో భాగంగా జరిగిన తొలి పోరులో సంగారెడ్డిపై 48 పాయింట్లు, రెండో మ్యాచ్‌లో వరంగల్ జట్టుపై 21 పాయింట్ల తేడాతో గెలుపొందింది. వరుస విజయాలతో సత్తా చాటిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
News December 27, 2025
రేపు అయోధ్యకు చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు రేపు అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం HYDలో ఉన్న ఆయన రేపు ఉదయం 9 గంటలకు రామ జన్మభూమికి వెళ్తారు. ఉ.11.30 నుంచి మ.2.30 వరకు రామమందిరంలో ఉంటారు. అనంతరం మ.3గంటలకు అయోధ్య నుంచి విజయవాడకు బయల్దేరుతారు. మరోవైపు ఈ నెల 30న సీఎం కుటుంబం విదేశీ పర్యటనకు వెళ్లనుందని తెలుస్తోంది. నాలుగు రోజుల వ్యక్తిగత పర్యటన అనంతరం తిరిగి వస్తారని సమాచారం.
News December 27, 2025
చెరువుగట్టుకు అదనంగా రూ.1.11 కోట్ల ఆదాయం

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో మోహన్ బాబు శనివారం H-1, L-1 టెండర్ల వేలం నిర్వహించారు. తలనీలాలు సేకరించుకొను హక్కునకు బహిరంగ వేలం, సీల్డు టెండర్, ఇ-టెండర్ నిర్వహించగా మూడింటిలో కలిపి 20 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా రూ.2.50 కోట్లకు గాను KM.హెయిర్స్ ఇంటర్నేషనల్, తమిళవాడు వారిపేరిట టెండర్ ఖరారు చేశారు. గతేడాది కంటే రూ.1.11 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.


