News March 31, 2026
యర్నగూడెం హైవేపై యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

యర్నగూడెం NH16పై సోమవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు..గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 30-40 ఏళ్లున్న వ్యక్తి స్పాట్‌లో మరణించాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96624, 94407 96584 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News April 20, 2026
కాయకవే కైలాస.. బసవన్న మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం!

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం సంఘ సంస్కర్త బసవన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. “కాయకవే కైలాస” అనే ఆయన బోధన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. పని పట్ల నిబద్ధత, నిజాయితీతో కర్తవ్యాన్ని నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 20, 2026
దళారుల ఉచ్చులో పడకండి: DTO

తూ.గో (D) రవాణాశాఖ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉన్నట్లు DTO ఆర్. సురేశ్ సోమవారం తెలిపారు. లైసెన్స్ కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని వినియోగదారులకు సూచించారు. సమాచారం కోసం నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఎవరైనా లంచం అడిగితే తక్షణమే తమకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. పారదర్శక సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.