News July 4, 2024
యర్రగుంట్ల: బొగ్గు వ్యాగన్లలో మృతదేహం

యర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. కార్మికుల వివరాల ప్రకారం.. బొగ్గును యూనిట్లకు సరఫరా చేస్తున్న సమయంలో మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి బయలుదేరి ఈ వ్యాగన్లు ఇవాళ ఆర్టీపీపీకి చేరుకున్నాయి. ఈ విషయం ఈ విషయం తెలుసుకున్న ఎస్పీఎఫ్ కలమల్ల పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
Similar News
News January 8, 2026
గండికోటలో తొలిసారి హెలికాప్టర్ ఎక్కేయండి..!

గండికోట ఉత్సవాలు ఈనెల 11, 12, 13న జరగనున్నాయి. టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి అందించడానికి గండికోటలో మొదటిసారిగా హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి తెచ్చారు. ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున వసూళ్లు చేస్తారు. కాసేపు గండికోటలో హెలికాప్టర్‌లో తిప్పుతారు. సంబంధిత వాల్‌పోస్టర్లను కడప ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP నేత శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు.
News January 8, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం ధరలు ఇలా..!

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం గ్రాము: రూ.13920
22 క్యారెట్ల గ్రాము ధర: రూ.12806
*వెండి 10 గ్రాములు: : రూ.2,435
News January 8, 2026
గండికోట ఉత్సవాలకు సింగర్ మంగ్లీ, రామ్ మిర్యాల, శివమణి రాక

జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఈ నెల 11 నుంచి 13 వరకు గండికోట ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఉత్సవాలకు మొదటి రోజు సింగర్ మంగ్లీ, రెండవ రోజు రామ్ మిర్యాల, మూడవరోజు శివమణి ఈ ఉత్సవాలలో అలరించనున్నారు. చివరిసారిగా 2020లో వైభంగా జరిగాయి. దీంతో అధికారులు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్నారు. ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


