News March 20, 2024
యలమంచిలిలో రూ5.62 లక్షల డ్వాక్రా సొమ్ము స్వాహా

యలమంచిలి మండలం మట్టావానిచెర్వులో ఆరు డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన రూ.5.62 లక్షలు వీఓవో తన సొంత ఖర్చులకు వినియోగించుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. కాగా గ్రూపు సభ్యులు బ్యాంకును సంప్రదించగా విషయం బయటపడింది. దీంతో సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం విచారణ జరిపి రూ.4.62 లక్షలు వసూలు చేయగా మిగిలిన డబ్బు బుధవారం చెల్లిస్తామని చెప్పినట్లు సమాచారం.
Similar News
News September 26, 2025
పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో డ్వామా కార్మిక శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు. 2025-26 సంబంధించి కొత్త క్యాటిల్ షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో హార్టికల్చర్ ప్లాంటేషన్ 350 ఎకరాల్లో చేపట్టాల్సి ఉందన్నారు.
News September 25, 2025
మొగల్తూరు: ఆరేళ్ళ బాలికపై అత్యాచారం

మొగల్తూరు మండలంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఎస్సై జి.వాసు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామంలో నిన్న ఇంట్లో తల్లితండ్రులు లేని సమయంలో బాలికను నిందితుడు కోనాల జాన్ బాబు(55) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News September 24, 2025
మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరమైన మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. 2023 – 24, 2025 – 2026 సంవత్సరాల్లో 1,550 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 915 పూర్తి చేయడం జరిగిందని, 103 నిర్మాణాల్లో ఉన్నాయని, ఇంకా 532 ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు.