News November 17, 2025

యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్?

image

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయ్‌కుమార్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్‌లో 15మంది మృతి: పోలీసులు

image

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్‌కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.

ప్రజావాణి దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి: ములుగు కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులకు ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు ఉన్నారు.