News February 12, 2025
యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 16, 2025
తూ.గో: సార్వత్రికం.. చదువుల తోరణం

అనివార్య కారణాలతో చదువుకు దూరమైన వారికి సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) వరంలా మారింది. ఉమ్మడి జిల్లాలో దీనికి ఆదరణ గణనీయంగా పెరిగింది. మార్చి-2026 పరీక్షలకు పదో తరగతిలో 5,226, ఇంటర్లో 13,773 మంది హాజరవుతున్నారు. అత్యధికంగా కాకినాడ జిల్లా నుంచి 7,844 మంది, తూర్పుగోదావరి నుంచి 6,066, కోనసీమ నుంచి 5,089 మంది విద్యార్థులు ఉన్నత విద్యార్హతలు సాధించేందుకు సిద్ధమయ్యారు.
News December 16, 2025
రుషికొండ ప్యాలెస్ కోసం టాటా, లీలా గ్రూపుల ప్రతిపాదనలు

AP: విశాఖ రుషికొండ భవనాలపై <<17985023>>GOM<<>> చర్చించింది. ‘ఈ భవనాలపై ప్రజాభిప్రాయం తీసుకున్నాం. హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్, లీలా ప్యాలెస్‌తో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. వచ్చేవారం మళ్లీ సమావేశమై నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తాం’ అని మంత్రి కేశవ్ తెలిపారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆదాయం పెరిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుర్గేశ్ చెప్పారు.
News December 16, 2025
డిజిటల్ బోధన.. అలిపిరి వద్ద టౌన్ షిప్: TTD

TTD విద్యాసంస్థల్లో డిజిటల్ భోదన కోసం చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, CC కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ కాలేజీల తరహాలో రెండు JR.కళాశాల్లో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తాం. అలిపిరి సమీపంలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణం చేయనున్నాం. దీని ద్వారా 20-25 వేల మంది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.


