News March 20, 2024
యలమంచిలి: ట్రాక్టర్‌ని ఢీకొన్న బస్సు.. వ్యక్తి మృతి

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.
Similar News
News February 4, 2026
14వ తేదీ నుంచి వేటను నిలిపివేయండి: జేడీ లక్ష్మణరావు

విశాఖలో జరగనున్న ఐఎఫ్‌ఆర్, మిలాన్-2026 వేడుకల నేపథ్యంలో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మూలపాలెంలో నిర్వహించిన సదస్సులో మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నేవీ సూచనలు పాటించాలని, బోట్లు సంచరించకుండా సహకరించాలని ఆయన కోరారు. తీర ప్రాంతాల పరిశుభ్రతపై కూడా మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
News February 4, 2026
IFR-2026 ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ సమీక్ష

విశాఖలో IFR-2026, మిలాన్ వేడుకలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఈవెంట్లకు రాష్ట్రపతి, సీఎం వంటి ప్రముఖులతో పాటు లక్షలాది మంది ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీసీ కెమరాలతో నిఘా, నో-డ్రోన్ జోన్ అమల్లో ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు.
News February 4, 2026
విశాఖలో ఊపిరి తీసుకునేదెలా?

మహా విశాఖలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఢిల్లీ తరహాలో గాలి నాణ్యత పడిపోవడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నగరంలో సగటు AQI 234గా నమోదైంది. అయితే నిబంధనలు ఉల్లంఘించిన 7 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.10 కోట్ల భారీ జరిమానా విధించింది.


