News August 16, 2025
యల్లనూరు యువకుడిపై పోక్సో కేసు

యల్లనూరు (మం) జంగంపల్లికి చెందిన నాగ మల్లేశ్ పై పోక్సో కేసు నమోదైంది. తాడిపత్రికి చెందిన బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టి బాలికను కుటుంబీకులకు అప్పగించి, యువకుడిపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News August 16, 2025
గర్భిణి ఆత్మహత్య.. భర్త, అత్తమామల అరెస్ట్

కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అత్తారింటి వేధింపులు భరించలేక ఈ నెల 14న పుట్టింటికి వెళ్లిన శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు కారణమైన భర్త శ్రీనివాసులు, మామ శివప్ప, భర్త కరియమ్మలను ఇన్‌ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించారు.
News August 16, 2025
‘విద్యార్థులారా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి’

అనంతపురం JNTUలో బీటెక్ స్వీడన్ బ్యాచ్ కోర్స్‌లో CSE-3, ECE-7 సీట్లను స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తున్నట్లు వీసీ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ సుజాత తెలిపారు. వివరాలకు JNTUలోని డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు ఏడాదికి రూ.1,50,000 కోర్స్ ఫీజు ఉంటుందని తెలిపారు.
News August 15, 2025
జీరో ఫేర్ టికెట్.. అమ్మా జర్నీ ఫ్రీ!

అనంతపురం జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. బుక్కరాయసముద్రం ఆర్టీసీ బస్టాండ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని MP లక్ష్మీనారాయణ, MLA శ్రావణి ప్రారంభించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి ఫ్రీగా ప్రయాణం చేయొచ్చని తెలిపారు. జిల్లాలో 402 బస్సులను ఫ్రీ జర్నీకి కేటాయించారు.