News March 11, 2025

యాంటీ-నార్కోటిక్ బ్యూరోగా రూపేశ్ బాధ్యతల స్వీకరణ

image

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 11, 2025

HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

image

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లో‌కైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.

News March 11, 2025

HYDలో బయటకు వెళ్లాలంటే.. గొడుగు పట్టాల్సిందే!

image

గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.

News March 11, 2025

కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైతుంది: కేటీఆర్

image

కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ ఆగ‌మైపోతుందని కేటీఆర్ మండిపడ్డారు. సాగుకు స‌రిప‌డా నీళ్లు లేక‌, విద్యుత్ కోత‌ల‌తో అన్న‌దాత బోరున విలపిస్తున్నాడని అన్నారు. ‘చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే రైతన్న త‌ల్ల‌డిల్లిపోతుండు. ఏం చేయాలో దిక్కుతోచ‌క అన్న‌దాతలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు’ అని అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల‌పై ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

error: Content is protected !!