News September 13, 2025
యాకుత్‌పురా ఘటనకు.. బాధ్యులపై హైడ్రా చర్యలు

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికి డిమోషన్, ఇద్దరిని తొలగించాలని ఆదేశించింది.
Similar News
News September 13, 2025
KMR: జోరుగా గంజాయి సాగు, విక్రయాలు

జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో పలువురు అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. హంగర్గ గ్రామంలో కంది, ఇతర పంటలతో పాటు ఓ రైతు సాగు చేసిన 147 గంజాయి మొక్కలను సాగు చేయగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు గంజాయి సాగు చేస్తూ, పలుచోట్ల విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడా అధికారులు దాడులు చేస్తున్నపట్టికీ గంజాయి సాగు, విక్రయాలు మాత్రం తగ్గడం లేదు.
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
బెల్లంపల్లి: ఎన్‌కౌంటర్‌లో మావో వెంకటి మృతి

బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన మావోయిస్టు నాయకుడు జాడి వెంకటి ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో గురువారం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన వెంకటి, పార్టీలో కీలక పాత్ర పోషించారు. జాడి పోచమ్మ-ఆశయ దంపతులకు ఒక్క కుమారుడు కావడంతో కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయంలో సుంకరిగా పనిచేస్తూ మావో కొరియర్‌గా పనిచేశాడని స్థానికులు తెలిపారు.