News December 20, 2025
యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

యాక్టివేటెడ్ చార్‌కోల్ టాక్సిన్స్‌ను బయటకు పంపి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. * యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉన్న ఫేస్‌మాస్క్, ఫేస్‌వాష్ సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తాయి. మీరు వేసుకునే ఏ ప్యాక్స్‌లో అయినా యాక్టివేటెడ్ చార్‌కోల్ మిక్స్ చేసుకోవచ్చు. * దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సున్నితమైన చర్మం, రోసేసియా ఉన్నవారికి చాలా అనువైంది.
Similar News
News December 20, 2025
బంగ్లాను షేక్ చేస్తా.. గర్ల్‌ఫ్రెండ్‌తో హాదీ మర్డర్ నిందితుడు

ఉస్మాన్ హాదీ <<18610392>>హత్యతో<<>> బంగ్లా భగ్గుమంటోంది. దీంతో పోలీసులు మర్డర్ నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఫైజల్ అనే యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. హాదీ హత్యకు ముందు అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ‘బంగ్లాను షేక్ చేస్తా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని గంటలకే మరో ఇద్దరితో కలిసి అతడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ హాదీ ఒక చెవి నుంచి దూరి మరో చెవిలో నుంచి బయటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
News December 20, 2025
అనకాపల్లికి సీఎం చంద్రబాబు

AP: CM చంద్రబాబు ఇవాళ అనకాపల్లి(D) తాళ్లపాలెంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారు. బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో TDP నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు Dy.CM పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు.
News December 20, 2025
ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరపరా?

సాధారణంగా ఏడాది పొడవునా తిరుమల శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. కానీ ధనుర్మాసంలో ఈ సేవకు బదులుగా ‘తిరుప్పావై’ పఠనం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం వంటిది. అందుకే ఈ నెలలో శ్రీవారిని నిద్రలేపేందుకు గోదాదేవి రచించిన దివ్య ప్రబంధ పాశురాలను వినిపిస్తారు. ఫలితంగా ఈ నెల రోజులు సుప్రభాత సేవ ఏకాంతంగా కూడా జరగదు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


