News November 10, 2025

యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

నరసన్నపేట మండలం కోమార్తి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ కారు మరమ్మతులకు గురికావడంతో పెద్దపాడు నుంచి మెకానిక్ కోరాడ వెంకటేశ్ వచ్చి మరమ్మతులు చేస్తున్నాడు. ఆ సమయంలో వెనక నుంచి వస్తున్న కారు ఆగి ఉన్న కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ మృతిచెందగా కారులో ఉన్న సంతోశ్, సుశీల, శ్యాముల్ గాయపడ్డారు.

Similar News

News February 15, 2026

శ్రీకాకుళం: ఉద్యోగం పేరిట మహిళకు మోసం

image

ఉద్యోగాల పేరుతో తనతో పాటు మరికొందరు మోసపోయినట్లు శ్రీకాకుళంలోని బొందిలిపురానికి చెందిన ఎం. విజయలక్ష్మి శనివారం 2టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి, నాగేంద్ర రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. 15 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె వద్ద మరిన్ని వివరాలు సేకరించి టూ టౌన్ సీఐ ఈశ్వర్ రావు కేసు నమోదు చేశారు.

News February 15, 2026

పలాస కళాకారుడి అద్భుతం.. !

image

మహాశివరాత్రి పురస్కరించుకొని పలాసకు చెందిన సూక్ష్మ కళాకారుడు కొత్తపల్లి రమేశ్ ఆచారి తన అద్భుత కళాఖండంతో భక్తిని చాటుకున్నారు. పెన్సిల్ మొనపై శివలింగం, ఓంకారాన్ని అత్యంత సుందరంగా చెక్కి అందరినీ అబ్బురపరిచారు. సుమారు 5 గంటల శ్రమతో రూపొందించిన ఈ సూక్ష్మ శిల్పం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ రథసప్తమి లోగో, అతిచిన్న ప్రపంచ కప్ వంటి ఆకృతులతో రమేశ్ తన ప్రతిభను నిరూపించుకున్నారు.

News February 14, 2026

మూడు పద్దులు.. మూడు రంగులు

image

గ్రే, బ్రౌన్, బ్లూ.. ఈ రంగులు ఏపీ బడ్జెట్ వేళ తారస పడుతున్నాయి. ఈ రంగుల బ్యాగుల్లో బడ్జెట్ ప్రతులను ఉంచి అసెంబ్లీకి తీసుకొస్తున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూజ చేసిన తర్వాత వాటిని కేబినెట్‌లో ఆమోదించే నిమిత్తం సీఎం చంద్రబాబు, dy.సీఎం పవన్‌కు అందజేశారు. ప్రభుత్వం కొలువైన తర్వాత తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు గ్రే కలర్ బ్యాగు, తర్వాత బ్రౌన్, ఇవాళ బడ్జెట్ ప్రతులను బ్లూ కలర్ బ్యాగులో తెచ్చారు.