News February 16, 2025

యాగం చేసిన అనకాపల్లి ఎంపీ 

image

లోక కల్యాణార్థం సుదర్శన లక్ష్మీనరసింహ, లక్ష్మీ గణపతి, మృత్యుంజయ యాగం, మహా శాంతి హోమం నిర్వహించినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో కుటుంబ సమేతంగా వీటిని నిర్వహించామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ ప్రజా సంక్షేమ ప్రభుత్వాలు వర్ధిల్లాలని.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ యాగం చేశామన్నారు.

Similar News

News March 2, 2026

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

image

భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి 62 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 37, గ్రామీణాభివృద్ధికి 7 దరఖాస్తులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.

News March 2, 2026

పోలవరం జిల్లాలో టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్

image

పోలవరం జిల్లాలో 10వ తరగతి ఆపై చదివిన వారికీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని ప్రిన్సిపల్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఈ కామర్స్ డెలివరీ విభాగం, కస్టమర్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కొక్క విభాగంలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 19లోగా అప్లై చేసుకోవచ్చన్నారు.

News March 2, 2026

ప్రజావాణి దరఖాస్తులపై తక్షణ చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 83 దరఖాస్తులను స్వీకరించారు. భూ సమస్యల దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పెండింగ్‌ దరఖాస్తులను శాఖల వారీగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు