News August 18, 2025
యాచకురాలిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్: ADB CI

ADB శివాజీ చౌక్ సమీపంలో ఈనెల 8న యాచకురాలిపై అత్యాచారానికి, దోపిడీకి, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా పది రోజుల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. నిందితుడు గుడిహత్నూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన మాడవి నగేష్‌ను సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పట్టుకున్నామన్నారు. తాగిన మైకంలో, కామంతో నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News August 18, 2025
రాష్ట్రస్థాయి విజేతలుగా HYD, NZB

జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు అందులోనూ రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని బేస్ బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు కలాల శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో HYD, రంగారెడ్డి జాయింట్ విన్నర్లుగా, NZB తృతీయ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో HYD, NZB జాయింట్ విన్నర్లుగా నిలిచాయి.
News August 18, 2025
ADB: పోలీస్ గ్రీవెన్స్‌కు 20 ఫిర్యాదులు

ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రజల రక్షణ, భద్రతకు 24 గంటలు బాధ్యతాయుతంగా పని చేసే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సమస్యను తెలుసుకున్నారు. మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
News August 18, 2025
ఎడ్ల బండెక్కి.. రైతులను పరామర్శించిన పాయల్ శంకర్

ఎడ్ల బండెక్కి పంట పొలాల్లో కలియ తిరుగుతూ రైతన్నల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం చెందిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సోమవారం పర్యటించారు. భోరజ్ మండలలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కోరాట, పూసాయి, పిప్పర్‌వాడ తదితర గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరీ అగ్రికల్చర్ అధికారులతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటను పరిశీలించారు