News August 11, 2025
యాచారం: ట్రాక్టర్ ఢీకొని 3ఏళ్ల బాలిక మృతి

అప్పటి వరకు ఇంటి ముందు ఆడుకున్న పాపాయిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో కబలించింది. స్థానికుల వివరాలిలా.. రంగారెడ్డి జిల్లా యాచారం పరిధి మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వన్నాడపు బీరప్ప కుమార్తె అవంతిక (3)ను ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 14, 2025
HYDలో రేషన్‌కార్డులు కట్.. దేనికో తెలియక షాక్

HYDలో చాలా చోట్ల లబ్ధిదారులకు రేషన్‌కార్డు రద్దయ్యాయని లబోదిబోమంటున్నారు. రేషన్‌షాపుల దగ్గర కార్డ్ నం. ఎంటర్ చేసేవరకు తెలియడం లేదని, దీనిపై ఎలాంటి సమాచారం లేదని మండిపడుతున్నారు. IT చెల్లించకున్నా తమ తెల్లరేషన్‌కార్డు రద్దవ్వడంపై గందరగోళానికి గురవుతున్నారు. కాగా, ఆధార్, పాన్ ద్వారా ఆర్థిక స్థితిగతులను ఆదాయపన్నుశాఖ పరిశీలించి అనర్హుల కార్డు ర్దదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
News September 14, 2025
HYD: కొడుకును చంపి మూసీలో పడేశాడు

HYDలోని బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు అనాస్(3)ని తండ్రి మహమ్మద్ అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని ఏంతెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానంతో విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.
News September 14, 2025
HYD: 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో నిమగ్నం అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.