News March 10, 2025

యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

image

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.

Similar News

News November 7, 2025

15 అడుగుల ఎత్తు పెరిగిన గోంగూర మొక్క

image

TG: గోంగూర పంట 35 రోజుల్లోగా కోతకు వస్తుంది. మహా అయితే 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మం. అప్పన్నపేటలోని కృష్ణారెడ్డి ఇంట్లో ఓ గోంగూర మొక్క ఏకంగా 15 అడుగుల ఎత్తు పెరిగింది. దీన్ని తొమ్మిది నెలల క్రితం నాటారు. ఇప్పటికీ ఈ మొక్కకు 25కుపైగా కొమ్మలు ఉండి గుబురుగా ఆకులు వస్తున్నాయి. ఈ మొక్క నుంచి వచ్చే ఆకులను సేకరించి ఇప్పటికీ కూరకు వాడుతున్నామని కృష్ణారెడ్డి తెలిపారు.

News November 7, 2025

జగిత్యాల: నీటిలో మునిగి యువకుడు మృతి

image

జగిత్యాల(D) ఇబ్రహీంపట్నం మం. మూలరాంపూర్ శివారులోని సదర్ మార్ట్ ప్రాజెక్ట్ వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలోపడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్‌కు చెందిన పల్లికొండ సిద్దార్థ(18) బుధవారం చేపలుపట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News November 7, 2025

ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

image

జాతీయ స్థాయి వాలీబాల్‌ ప్లేయర్‌గా‌ ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.