News December 23, 2025

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఫ్లెక్సీల చించివేత

image

ఆలేరు నియోజకవర్గ నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమం పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరవుతున్న ఈ వేడుక కోసం వైకుంఠ ద్వారం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, నిషేధిత ప్రాంతంలో ఫ్లెక్సీలు కట్టారంటూ బీఆర్ఎస్ నాయకులు వాటిని చింపివేసి నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Similar News

News December 24, 2025

GVMC కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై కోర్టుకు

image

విశాఖలో మరోసారి నో-కాన్ఫిడెన్స్ రాజకీయాలు వేడెక్కాయి. GVMCలో అసమ్మతి కార్పొరేటర్లపై అనర్హత వేటు కోరుతూ YCP దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. 26 మందికి నోటీసులు ఇచ్చినా.. ఒక్క సభ్యురాలు మాత్రమే విప్ ఉల్లంఘన పరిధిలోకి వస్తారని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయంటూ YCP ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించనుంది. కాగా.. వచ్చే ఏడాది మార్చితో పాలక మండలి గడువు ముగియనుంది.

News December 24, 2025

20 లక్షల ఉద్యోగాల కల్పనకే ప్రాధాన్యం: CM

image

AP: మెరుగైన సేవలు వేగంగా అందించేందుకు ప్రభుత్వ శాఖలు ఇండికేటర్లను సిద్ధం చేసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణాంధ్ర-2047, 10 సూత్రాల అమలుపై నోడల్ అధికారులతో సమీక్షించారు. ’20లక్షల ఉద్యోగాల కల్పనే మొదటి ప్రాధాన్యంగా పని చేయాలి. 10 సూత్రాల అంశాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. కీలక మిషన్‌గా నీటి భద్రత అంశంపై దృష్టి పెట్టాలి. కరవు అన్న మాట లేకుండా వరద నీటి నిర్వహణ జరగాలి’ అని సూచించారు.

News December 24, 2025

NTR: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

క్రీస్తు బోధనలు త్యాగం, ప్రేమ, కరుణకు ప్రతీకలని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొంటూ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు చూపిన క్షమాగుణం, మానవత్వం అందరికీ ఆదర్శనీయమని అన్నారు. క్రిస్మస్ పర్వదినం జిల్లా ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని, క్రీస్తు కరుణతో జిల్లా అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.