News August 19, 2025
యాదగిరిగుట్ట ఆలయానికి నాలుగు ISO సర్టిఫికెట్లు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ISO 9001, ISO 22000తో సహా మొత్తం నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన తొలి ఆలయంగా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు, ప్రసాదాల తయారీలో అత్యున్నత ప్రమాణాలు పాటించినందుకు ఈ అవార్డులు వచ్చాయి. ఈ సర్టిఫికెట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క సమక్షంలో ఆలయ అధికారులకు ఈరోజు HYDలో అందజేశారు.
Similar News
News August 20, 2025
HYD: గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్: మంత్రి

గణేశ్ ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం HYD జూబ్లీహిల్స్ పరిధిలోని MCRHRDలో గణేశ్ ఉత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఎక్కడా సమస్యలు రాకుండా చూస్తామన్నారు. పోలీస్ బందోబస్తు ఉంటుందని, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News August 20, 2025
సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రికి ఓ స్పెషల్ ఆఫీసర్: హెల్త్ మినిస్టర్

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ట్రేషన్ పరంగా లోపాల నివారణకు గాను స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఓపీ బ్లాక్, ఐవీఎఫ్ సెంటర్ తదితర విభాగాలను పరిశీలించారు. పలువురు పేషంట్లతో మాట్లాడారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు రూ.5 కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
News August 19, 2025
HYD: వరుసగా వర్షాలు.. నగరంలో మురుగు పరుగులు

వరుసగా వర్షాలు కురుస్తుండడంతో గ్రేటర్ HYDలో మురుగు పరుగులు పెడుతోంది. దీంతో పాదచారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్, మాదన్నపేట, బాలానగర్‌లోని రాజీవ్ గాంధీనగర్, గచ్చిబౌలిలోని ఓఆర్ఆర్ ఎక్స్ రోడ్, కొండాపూర్‌లోని కేఎంఆర్ ఎస్టేట్ వద్ద, బేగంపేటలోని వసంతనగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.