News October 10, 2025
యాదగిరిగుట్ట పాత గుట్టలో నిత్య కళ్యాణ మహోత్సవం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పూర్వ గిరి లక్ష్మీనరసింహస్వామి వారి పాత గుట్ట దేవాలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవ సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 10, 2025
సిద్దిపేట: లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులు

మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులు ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటి అలియాస్ రమేశ్, తొండెం గంగ అలియాస్ సోనీ, మొగిలిచర్ల చందు అలియాస్ వెంకట్రాజు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు. మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోవాలన్నారు. తెలంగాణకు చెందిన 72 మంది మావోయిస్టులు ఉన్నారని చెప్పారు.
News October 10, 2025
NRPT: ఈనెల 11న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ

నారాయణపేట జిల్లా శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పదవీకాలం ముగియడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాల మేరకు సహాధికారి శంకరాచార్యను ఎన్నికల అధికారిగా నియమించారు. ఈనెల 11న పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో మహాజన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 మంది కార్యవర్గ సభ్యులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ట్రెజరర్, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధుల ఎన్నికలు రహస్య బ్యాలెట్ విధానంలో జరగనున్నట్లు అధికారి తెలిపారు.
News October 10, 2025
HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్..15,641 కేసులు నమోదు

సైబరాబాద్ పోలీసులు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై 15,641 కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.72,02,900 జరిమాణాలు విధించినట్లు వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎదుటివారి ప్రాణాలకు ముప్పు అని తెలిపారు.