News March 28, 2025

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాద విక్రయాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172, లీజేస్ రూ.22,92,572, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చింది.

Similar News

News July 5, 2025

ములుగు: ‘లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

image

జిల్లాలో వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు తక్షణ సహాయం కోసం కంట్రోల్ రూమ్ 1800 4257109 నంబర్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. ప్రజలందరూ జిల్లా అధికార వాట్సాప్, ఛానల్‌ను చేసుకోవాలని సూచించారు. రానున్న మూడు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News July 5, 2025

అమలాపురం: 10వ తేదీన మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ సమావేశం 2.0 నిర్వహించాలని ఆదేశించినట్లు కలెక్టర్ మహేశ్ష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో సమావేశాలను నిర్వహించాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు.

News July 5, 2025

వనపర్తి: ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర కీలకం: కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ) పాత్ర ఎంతో కీలకమని, బీఎల్ఓలందరూ ఫామ్ 6, 7, 8లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓలకు జులై 3వ తేదీ నుంచి జులై 10వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బీఎల్ఓలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు.