News March 1, 2025
యాదగిరి శ్రీవారి నిత్య ఆదాయం ‘రూ.19,09,151’

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం 728 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా మ కళ్యాణ కట్ట ద్వారా రూ.36,400, ప్రసాద విక్రయాలు రూ.7,42,750, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.1,12,500, కార్ పార్కింగ్ రూ.191,500, యాదరుషి నిలయం రూ.33,114, అన్నదానం రూ.1,06,061, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.19,09,151 ఆదాయం వచ్చింది.
Similar News
News September 15, 2025
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి చెందిన ఘటన చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో చోటుచేసుకుంది. కుమారుడు చక్రపు వాసు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి శాంతమ్మ (90) మనోవేదనకు గురయ్యారు. ఈ విషాదాన్ని భరించలేక సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.
News September 15, 2025
SRCL: ‘గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహారం వండాలి’

గ్యాస్ స్టవ్ పైనే విద్యార్థులకు ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం చింతల్ఠాణా ఆర్&ఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పూర్తి చేసిన కిచెన్ షెడ్, విద్యాలయ ఆవరణను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో నీరు నిలవకుండా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బిందికి సూచించారు.
News September 15, 2025
పార్వతీపురం: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 10 వినతులు వచ్చినట్లు ఎస్పీ అంకిత సురాణా తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించారు. సమస్యల నివేదక ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.