News August 14, 2025

యాదగిరి శ్రీవారి నిత్య ఆదాయం ఎంతంటే?

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, యాదరుషి నిలయం కళ్యాణకట్ట, వ్రతాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.15,69,845 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు.

Similar News

News August 14, 2025

BREAKING.. నల్లగొండ: పోక్సో నింధితుడికి ఉరి శిక్ష

image

నల్లగొండలో పోక్సో ఇన్‌ఛార్జి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు మహమ్మద్ ముక్రంకు ఉరి శిక్షతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్లడించారు.

News August 14, 2025

విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

News August 14, 2025

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.