News February 11, 2025

యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.

Similar News

News February 11, 2025

నాగిరెడ్డిపేట: కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా వచ్చాడు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మంగళ్ శంకర్ (40) కుటుంబీకులతో కలిసి కుంభమేళాకు వెళ్లి విగతజీవిగా తిరిగివచ్చాడు. 5 రోజుల క్రితం ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో వెంటనే లక్నోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇవాళ ఉదయం మృతదేహం స్వగ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

News February 11, 2025

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ (భారత ప్లేయర్లు)

image

*సచిన్- 34357 రన్స్ (782 ఇన్నింగ్సులు)
*విరాట్- 27329 (611)
*రాహుల్ ద్రవిడ్- 24208 (605)
*రోహిత్ శర్మ- 19519 (526)
*గంగూలీ- 18575 (488)
*ధోనీ- 17266 (526)
*సెహ్వాగ్- 17253 (443)
*అజహరుద్దీన్- 15593 (455)

News February 11, 2025

వనపర్తి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

కొత్తకోట మున్సిపాలిటీలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. దేవరకద్ర మండలం గుడిబండకి చెందిన విగ్నేశ్వర్ రెడ్డి(50) కొత్తకోటలోని అంబభవాని మాత ఉత్సవాలకు వచ్చారు. బైక్‌పై చౌరస్తాకు వెళ్తుండగా.. వనపర్తి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విగ్నేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

error: Content is protected !!