News February 23, 2025

యాదాద్రిలో CM టూర్.. వాహనాలకు నో ఎంట్రీ

image

సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి కొండపైకి వాహనాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కొండ కింద పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని సూచించారు. కొండపైకి నిత్యం 25 బస్సులు నడుస్తాయాన్నారు. 

Similar News

News February 23, 2025

రాష్ట్రంలో 14,236 ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత

image

TG: రాష్ట్రంలో 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ల పోస్టుల భర్తీకి <<15545264>>గ్రీన్ సిగ్నల్<<>> లభించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఈ ఉద్యోగాలకు ఇంటర్ అర్హత(గతంలో టెన్త్ ఉండేది) తప్పనిసరి. 18-35 ఏళ్ల వయసుండాలి. ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 పోస్టులకు జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అలాగే అర్హత ఉన్న 567 మంది హెల్పర్లకు టీచర్లుగా ప్రమోషన్ కల్పించే అవకాశం ఉంది.

News February 23, 2025

విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..!

image

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అరెస్టు చేసినట్లు ఆదివారం ధ్రువీకరించారు. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిని గుర్తించామని.. వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

News February 23, 2025

మయన్మార్‌లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు 

image

మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన వబ్బలరెడ్డి మణికంఠతో పాటు మరో ముగ్గురు యువకులు ఉపాధి నిమిత్తం మయన్మార్ వెళ్లారు. అక్కడ సరైన పని కల్పించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నా కుదరలేదు. విషయం తెలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను సంప్రదించి ఆ యువకులను స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

error: Content is protected !!