News October 18, 2025

యాదాద్రి: అనుకూలిస్తున్న వాతావరణం.. కొనుగోళ్లకు సిద్ధం

image

జిల్లాలో వరుస వానలతో భయపెట్టిన వరుణుడు గత 3 రోజులుగా కాస్త కరుణించాడు. ప్రస్తుతం వాతావరణం రైతులకు అనుకూలంగా ఉంది. ఉదయం పొగమంచు, ఆ తర్వాత ఎండ వస్తుండటంతో వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, పత్తిని రైతులు ఎండబెడుతున్నారు. తిరిగి వరి కోతలు ప్రారంభించి, ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కేంద్రాలను సిద్ధం చేయడంతో కొనుగోలు ప్రక్రియ త్వరలో మొదలుకానుంది.

Similar News

News October 18, 2025

APకి కొత్తగా 106 PG మెడికల్ సీట్లు: సత్యకుమార్ యాదవ్

image

AP: ప్రభుత్వ PG వైద్య విద్యలో అదనంగా 106 సీట్ల భర్తీకి NMC ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గైనిక్, పీడియాట్రిక్, ఎనస్థీషియా, రేడియాలజీ విభాగాల్లో ఈ సీట్లున్నాయి. ఇందులో 60 సీట్లు 5 కొత్త కాలేజీలకు వస్తున్నాయి. గతేడాది ప్రభుత్వం అదనపు సీట్ల మంజూరుకు ప్రతిపాదన పంపింది. దీనిపై మంత్రి సత్యకుమార్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో స్వయంగా మాట్లాడారు. దీంతో కొత్త మెడికల్ సీట్లు మంజూరయ్యాయి.

News October 18, 2025

అధిష్ఠానం ముందుకు.. నెల్లూరు టీడీపీ నేతల వ్యవహారం!

image

నెల్లూరులో పెద్ద దుమారం రేపిన రేషన్ మాఫియా వ్యవహారం TDP అధిష్ఠానం వద్దకు చేరుకుంది. నెల్లూరులో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలను ఇటీవల పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి ద్వజమెత్తిన విషయం తెలిసిందే. అదే పార్టీకి చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి రేషన్ మాఫియా వెనుక ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నుడా చైర్మన్, మరో నేత విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.

News October 18, 2025

మిగిలిన బాణసంచాను జాగ్రత్తగా భద్రపరచాలి: SP

image

దీపావళి సందర్భంగా కేఎల్‌పురం శివార్లలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా పరిశీలించారు. వ్యాపారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, షాపుల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను సురక్షిత గోడౌన్లలలో భద్రపర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.