News October 13, 2025
యాదాద్రి: అపూర్వం.. అత్తాకోడళ్ల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మకూర్(M) మండల కేంద్రంలో కోరే వారి అత్తాకోడళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. దూర ప్రాంతాలకు చెందిన బంధువులందరినీ ఒకే చోట చేర్చి, కుటుంబ బంధాలను బలోపేతం చేశారు. ఈ సందర్భంగా పాత తరానికి చెందిన అత్తలు తమ అనుభవాలను, కష్టసుఖాలను కొత్త తరానికి చెందిన కోడళ్లకు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి బంధువులు ఒకే వేదికపైకి రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News October 13, 2025
రాయుడు ఎపిసోడ్.. MLA ఏమంటారో?

సొంత పార్టీ మహిళా నేత<<17990235>> వినుతకోట<<>>కు అన్యాయం జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు పవన్ పట్టించుకోలేదని YCP ఆరోపించింది. ఆమెకు ఆ పార్టీ మరోనేత హరిప్రసాద్ నుంచి కూడా మొండి చెయ్యి ఎదురైనట్లు సమాచారం. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న MLA బొజ్జలపై అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది. కాగా ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.
News October 13, 2025
రూ.2లక్షలకు చేరువలో కిలో వెండి

కిలో వెండి ధర రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కేజీపై ఏకంగా రూ.5వేలు పెరిగి రూ.1,95,000గా ఉంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.320 పెరిగి రూ.1,24,540కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది.
News October 13, 2025
మందుకు మందు వేయాల్సిందే!

కష్టాలేవైనా మందు తాగడమే వాటికి మందు అని కొందరి మాట. కానీ ఏపీలో మాత్రం తాగితే కొత్త కష్టాలు వచ్చేలా ఆల్కహాల్ ఉంటోంది. తాజా నకిలీ మద్యం బాగోతంతో తాము తాగేది స్వచ్ఛమైన ఆల్కహాలేనా? అని అనుమానంతోనే ఖజానా పోషకులు గ్లాసు నింపుతున్నారు. మద్యం పారకుంటే ప్రభుత్వాలు నడవలేని స్థితిలో.. కల్తీ అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని కబళిస్తోంది. ఈ మహమ్మారికి మందు వేసి బాగు చేయాలనేది ప్రతి ఒక్కరి డిమాండ్.