News March 15, 2025
యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్కు చెందిన చామల రమేశ్గా గుర్తించారు.
Similar News
News March 15, 2025
HYD: ముప్పుగా మారుతున్న స్టంట్స్

రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లి PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 276 వద్ద నుంచి డైరీ ఫామ్ రూట్లో కొంతమంది మైనర్లు నాలుగు వాహనాలపై ప్రమాదకరమైన ఫీట్లు (స్టంట్స్) చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసిన ఇతర వాహనదారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
News March 15, 2025
గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేశారు: రేవంత్

TG: ప్రభుత్వ ఆలోచనలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అది BRS సభ్యులకూ తెలుసు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కార్యకర్త ప్రసంగంలా ఉందని అవహేళన చేశారు. గతంలో మహిళా గవర్నర్ను అవమానించిన చరిత్ర వారిది’ అని విమర్శించారు. మరోవైపు KCRపై CM వ్యాఖ్యలను ఖండిస్తూ BRS సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
News March 15, 2025
పెద్దపల్లి: జిల్లా పంచాయతీ అధికారిని కలిసిన నూతన కార్యవర్గం

టీఎన్జీవో అనుబంధ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ సెంటర్ ఫోరం పెద్దపల్లి జిల్లా నూతన కార్యవర్గం శనివారం పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని డిపివోను కోరగా సమస్యలు ఉన్నతాధికారులకు సిపారసు చేస్తానని డిపివో హామీ ఇచ్చారు. డిపివోను కలిసిన వారిలో టిఎన్జివో జిల్లా అధ్యక్షులు బొంకురి శంకర్, కార్యదర్శులు ఉన్నారు.