News September 21, 2025

యాదాద్రి: ఇందిరమ్మ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. భువనగిరి మండలం తుక్కాపురంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఇండ్ల సంఖ్యను పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుడు రాచకొండ పాండు ఇంటిని సందర్శించారు.

Similar News

News September 21, 2025

మెదక్: ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టండి: పీడీ

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పనులు మొదలుపెట్టాలని హౌసింగ్ పీడీ మాణిక్యం సూచించారు. జిల్లాలో 9,156 ఇళ్లు మంజూరు కాగా, 5,511 ఇళ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఇందులో ఐదు పూర్తి కాగా బెస్మెంట్ లేవల్‌లో 2,408, లెంటల్ లేవల్‌లో 295, స్లాబ్ లేవల్‌లో 124 ఉన్నాయన్నారు. 2,832 ఇళ్లకు బిల్ జనరేట్ కాగా 2,500 మందికి బిల్లులు జమ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

News September 21, 2025

లా విద్యార్థులకు విజయవాడలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం

image

APCRDA కార్యాలయం నుంచి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్న్‌షిప్ చేసేందుకు 2025లో లా కోర్సు పూర్తి చేసినవారు, ఫైనలియర్ LLB చదివేవారు ఈ నెల 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. దరఖాస్తు చేసినవారిలో ఇద్దరిని ఎంపిక చేస్తామని, వివరాలకు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్ చూడాలని సూచించారు.

News September 21, 2025

2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్

image

ప్రధాని పదవికి బీజేపీలో ఎలాంటి పోటీ లేదని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2029తో పాటు 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనేనని ఇండియా టుడేతో ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రజలతో మమేకమవ్వడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, సంక్షోభంలోనూ నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మోదీకే చెల్లిందని కొనియాడారు. పహల్గాం ఘటనకు స్పందించిన తీరే దీనికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు.