News November 27, 2025
యాదాద్రి: ఈ గ్రామాల్లో తొలిసారి ఎన్నికలు

యాదాద్రి జిల్లాలోని 153 సర్పంచ్, 1,286 వార్డులకు నేటి నుంచి నామినేష్లను స్వీకరించనున్నారు. అయితే జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఆరు గ్రామ పంచాయతీల్లో తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆలేరు మండంలోని బైరాంనగర్, సాయిగూడెం, తుర్కపల్లి మండలంలోని గుర్జవానికుంటతండా, ఇందిరానగర్, బొమ్మలరామారం మండలంలోని ఖాజీపేటకు తొలి విడతలో, మోటకొండూరు మండలంలో అబీద్‌నగర్, పెద్దబావి పంచాయతీలకు 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: హత్యాయత్నం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

మద్యం మత్తులో భార్యను, కొడుకును చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో దాడి చేసి గాయపర్చిన వ్యక్తిపై నేరం రుజువైనందున భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి A.నాగరాజు నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చారు. భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మార్త రాజేశ్ ఈ నేరం చేశాడని, అతడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకీర్త్ అభినందించారు.
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
BREAKING: వికారాబాద్ జిల్లాలో భూకంపం!

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచర్లలో భూకంపం వచ్చింది. గురువారం సాయంకాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయని, గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. గ్రామస్థులు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి చేరుకొని వివరాలను ఆరా తీస్తున్నారు.


