News September 6, 2025
యాదాద్రి: ఉత్తమ ఉపాధ్యాయుడితి గౌరవం..!

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుండాల మండలం వస్తాకొండూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంపాల రాజు ఎంపికయ్యారు. జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు ఆయన్ను వరించింది. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రాజు నిన్న అవార్డు అందుకున్నారు. గత 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన అనేకమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు.
Similar News
News September 6, 2025
KNR: యూరియా లేక అన్నదాతల ఆందోళన

జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న యూరియా కోసం ఎదురుచూపులు తప్పటం లేదని రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాది రైతులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడే దుస్థితి నెలకొందని వాపోయారు. ప్రస్తుతం పంటలకు యూరియా వేసే సమయం కావటంతో ఇబ్బందులు పడుతున్నామని.. పరిస్థతి ఇలానే ఉంటే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతున్న కోరుతున్నాడు.
News September 6, 2025
బాలాపూర్ గణేశ్ లడ్డూ డబ్బులను ఏం చేస్తారంటే?

TG: బాలాపూర్ గణేశ్ లడ్డూ <<17628120>>వేలం<<>> ద్వారా వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఆ గ్రామంలో బొడ్రాయి వద్ద ఉత్సవ సమితి వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. 1994లో తొలిసారి వేలం ప్రారంభం కాగా.. ఇప్పటివరకు రూ.కోటికి పైగా అభివృద్ధి కోసం వెచ్చించారు. గ్రామంలో స్కూల్, రోడ్లు, ఆలయాలు నిర్మించారు. దీంతో ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. స్థానికులతో పాటు స్థానికేతరులూ ఆ వేలంలో పాల్గొనవచ్చు.
News September 6, 2025
KNR: నిమజ్జనం పూర్తయ్యేదాకా అప్రమత్తత అవసరం

మనకొండూరులో జరుగుతున్న గణేష్ నిమజ్జనోత్సవాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, సి.పి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి సందర్శించి కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రజల రద్దీ నియంత్రణపై కలెక్టర్ తగు సూచనలు చేశారు. నిమజ్జనం పూర్తయ్యేవరకు అధికారులు అప్రమత్తతో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.