News February 13, 2025

యాదాద్రి: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 13, 2025

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని తనిఖీ చేసిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సదరం క్యాంప్ నిర్వహణ తీరును పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. రోగులను క్రమ పద్ధతిలో వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోబెట్టి పిలవాలని సదరం నిర్వాహకులకు చెప్పారు. చర్మ వ్యాధి సోకిన సంవత్సరంన్నర పాప శంకరపల్లి రన్వితను కలెక్టర్ పలకరించారు.

News February 13, 2025

చాగల్లు: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

image

చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన దుర్గాభవాని(35), వివాహిత కుమార్తె కుమారుడు సంతానం ఇటీవల ఆర్థిక ఇబ్బందులు కారణంగా మనస్థాపానికి గురై గురువారం ఆమె పిల్లలతో మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోంది. చికిత్స నిమిత్తం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 13, 2025

రేపు మాలమహానాడు బంద్ లేదు: రాష్ట్ర అధ్యక్షుడు

image

జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణలో ఎలాంటి బంద్‌కు పిలుపునివ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. గుర్తు తెలియని వారు సంఘం పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిని విద్యారంగ సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు గమనించాలని కోరారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే వరకు మాల మహానాడు కార్యకర్తలు సహకరించాలని సూచించారు. 

error: Content is protected !!