News February 19, 2025
యాదాద్రి కలెక్టర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపురం మహా కుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ హనుమంతరావును యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
Similar News
News December 15, 2025
పోచంపల్లి: నాడు 3 ఓట్లతో ఓటమి.. నేడు 804 మెజార్టీతో గెలుపు

పోచంపల్లి మండలం జూలూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కాసుల అంజయ్య గౌడ్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వట్టిపల్లి బాలరాజుపై 804 ఓట్లతో భారీ మెజార్టీ సాధించాడు. అయితే 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కేవలం 3 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. అప్పుడు ఓడిన చోటే భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం.
News December 15, 2025
పెద్దవూర: మూడు ఓట్లతో ఇండిపెండెంట్ విజయం

పెద్దవూర మండలం సంగారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఇండిపెంటెండ్ ఈసం రమేష్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ బలపరిచిన మాతంగి శ్రీనయ్య మీద 3 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధితో పాటు గ్రామానికి సేవ చేస్తా అని అన్నారు.
News December 15, 2025
NZB: వాటి వల్ల ప్రాణహాని కలిగితే హత్య కేసు: CP

చైనా మాంజాతో వ్యక్తులకు ప్రాణహాని జరిగితే హత్యానేరం కేసు నమోదు చేస్తామని CPసాయిచైతన్య హెచ్చరించారు. చైనా మాంజా వాడటం ప్రమాదకరమని, ప్రజలు, జంతువులు, పక్షులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. చైనా మాంజా నిల్వ ఉంచినా, తయారు చేసి విక్రయించినా, ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరి వద్ద అయినా చైనా మాంజా ఉన్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అప్పగించాలని సూచించారు.


