News May 29, 2024
యాదాద్రి: కల్తీ పాల తయారీదారు అరెస్టు

కల్తీపాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని భువనగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పట్టణ పరిధిలోని ముఖ్తాపూర్‌కు చెందిన సన్న ప్రశాంత్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం ఎస్ఓటీ పోలీసులు పాలు విక్రయించే ఇంటికి వెళ్లి సోదా చేయగా.. 60 లీటర్ల కల్తీపాలు, 250ML హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో పాల పౌడర్ ప్యాకెట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News September 13, 2025
నకిరేకల్: విద్యార్థినికి వేధింపులు.. టీచర్ సస్పెండ్..!

నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్‌పై <<17696456>>లైంగిక వేధింపుల <<>>ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారి విచారణ జరిపి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపించారు. నివేదిక అందిన వెంటనే సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
News September 13, 2025
సత్తా చాటిన నల్గొండ పోలీస్

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజులపాటు నిర్వహించిన 7వ ఆల్ ఇండియా జైళ్ల శాఖ క్రీడల్లో 24 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల్లో నల్గొండ జిల్లా జైలు పోలీస్ మామిడి చరణ్ 80 కిలోల విభాగంలో కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి తెలంగాణకు గౌరవం తీసుకొచ్చాడు. ఈ విజయంపై జైలు అధికారులు, పోలీసులు శ్రావణ్, గణేష్, సైదులు, రాంబాబు అభినందనలు తెలిపారు.
News September 13, 2025
నల్గొండ: ఆర్టీసీకి రూ.32.59 లక్షల ఆదాయం

నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా నాలుగు నెలల్లో రూ.32.59 లక్షల ఆదాయం సమకూరిందని ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. జూన్‌లో 22 బస్సులతో రూ. 11.95 లక్షలు, జూలైలో 22 బస్సులతో రూ. 13 లక్షలు, ఆగస్టులో 18 బస్సులతో రూ. 6.47 లక్షలు, సెప్టెంబర్‌లో 3 బస్సులతో రూ. 1.16 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు.