News October 9, 2025
యాదాద్రి: కోతులను మాస్కులతో తరిమేస్తున్నారు.!

అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నిత్యం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ విద్యార్థులు భోజనం చేసే సమయంలో కోతులు విరుచుకుపడుతూ, దాడులు చేస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి విద్యార్థులు గురువారం చింపాంజీ, సింహం ఆకారంలో ఉన్న మాస్కులు ధరించి, కోతులను తరిమికొట్టేందుకు వినూత్నంగా యత్నించారు. నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.
Similar News
News October 9, 2025
CM చంద్రబాబు పర్యటనపై కొనసాగుతున్న సందిగ్ధత.?

CM చంద్రబాబు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలోపాటు సిటీ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చెయ్యాలి. ఈ క్రమంలో జిల్లా అధికారులు హెలిపాడ్‌ను సైతం సిద్ధం చేశారు. అయితే ఇంతవరకు సీఎం పర్యటన అధికారకంగా ఖరారు కాలేదు. నెల్లూరులో అడపదడప కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
News October 9, 2025
SEBIలో 110 పోస్టులు

SEBI 110 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. OCT 30 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోస్టును బట్టి BE, బీటెక్, LLB, PG, CFA, CA, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫేజ్1, ఫేజ్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.sebi.gov.in/
News October 9, 2025
తెనాలి: ‘మావు’లకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు.!

కాలువల్లో చేపల వేటకు ఉపయోగించే వెదురు ‘చేపల మావుల’ తయారీలో తెనాలి సమీప ఆలపాడు ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి చేపల మావులు అనగానే ముందుగా గుర్తొచ్చేది చుండూరు మండలం ఆలపాడు గ్రామమే. నాణ్యమైన మన్నికైన చేపల మావులు కోసం అనేక మంది ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసుకు వెళుతుంటారు. ఇక్కడ చాలా కుటుంబాలు వ్యవసాయ పనులతో పాటు వీటి తయారీ వృత్తిపైనే ఆధారపడ్డాయి.