News February 11, 2025
యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్!

యాదాద్రి క్షేత్రంలో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్ గురైనట్లు సమాచారం. సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ ఉద్యోగి విధులకు హాజరుకాకపోగా, రికార్డు అసిస్టెంట్ కొండపైకి వెళ్లే వాహనాల రుసుములను ఆలయానికి చెల్లించకపోవడంతో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News January 1, 2026
జగిత్యాల: చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ముందస్తు కార్యాచరణతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. శాంతిభద్రతల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలతో పర్యవేక్షణ చేపట్టామని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 138 మందిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News January 1, 2026
ప్రసాదంపై తప్పుడు వీడియో… భక్తులపై కేసు

AP: ప్రసాదంలో నత్తగుల్ల వచ్చిందని వీడియో పెట్టిన ఇద్దరు భక్తులపై సింహాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. DEC 29న ఆ భక్తులు ప్రసాదాన్ని బయటకు తీసుకెళ్లి తిరిగి తెచ్చారని, ఆ సమయంలో వారు కల్తీ చేసి ఉంటారని పేర్కొన్నారు. ‘ఆరోజు 15వేల పులిహోర పొట్లాలు అమ్మాం. ఇలాంటి ఫిర్యాదు గతంలోనూ ఎవరినుంచీ రాలేదు. ప్రసాదం తయారీలో నిపుణులైన వంటవారు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు’ అని పేర్కొన్నారు.
News January 1, 2026
అనకాపల్లి: రేపటి నుంచి రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ

జిల్లాలో రేపటి నుంచి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రీసర్వే జరిగిన 373 గ్రామాల్లో గతంలో జారీ చేసిన 2,01,841 పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజు ముద్రతో కొత్తవి రైతులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులకు అందజేసి రైతులు కొత్తవి పొందాలని కోరారు.


