News December 15, 2025
యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.
Similar News
News December 16, 2025
ఎన్నికల బందోబస్తుకు 570 మంది పోలీసులు: ఎస్పీ సంకీర్త్

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా 570 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి (MCC) అమలులో ఉంటుందని తెలిపారు.
News December 16, 2025
టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్

కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేరును పార్టీ అధిష్టానం మంగళవారం ఖరారు చేసింది. కార్యదర్శిగా శ్రీనివాస్ బాబా పేరును ప్రకటించారు. అయితే ఎంపీ సానా సతీశ్ ఈ పదవికి తోట నవీన్ పేరును సిఫార్సు చేయగా, అధిష్టానం జ్యోతుల నవీన్‌ను ఎంపిక చేయడం గమనార్హం. వీరిద్దరూ పాతపారే కావడం విశేషం. దీంతో ఎంపీ సతీశ్ నిరాశలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
News December 16, 2025
ములుగు కలెక్టర్ ప్రొఫైల్‌తో ఫేక్ వాట్సాప్ సందేశాలు

ఫేక్ వాట్సాప్ సందేశాలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ దివాకర టీఎస్ కోరారు. తన ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ అధికారులకు వ్యక్తులకు సందేశాలు పంపి డబ్బులు అడుగుతున్నారన్నారు. ఇలాంటి నకిలీ సందేశాలు అందిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు, సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.


