News December 11, 2025
యాదాద్రి జిల్లాలో పోలింగ్ ప్రారంభం

యాదాద్రి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బి. ఐలయ్య తన సతీమణితో కలిసి సైదాపురంలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం తన ఓటును వినియోగించుకుని మాట్లాడారు. ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మండల అభివృద్ధి అయినా, గ్రామ అభివృద్ధి అయినా సర్పంచులతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✓నేటితో ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓రేపు సారపాక, పినపాక ప్రాంతాల్లో పవర్ కట్
✓సుజాతనగర్ PHCని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
✓బూర్గంపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✓భద్రాచలం: ముక్కోటి గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✓మణుగూరు: అడవిలో చెట్ల నరికివేత హైకోర్టు బ్రేక్
✓రేపు నవోదయ ప్రవేశ పరీక్ష… జిల్లాలో 8 కేంద్రాలు
News December 13, 2025
యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

దేశంలో యోగా ప్రచారం, హర్బల్ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.


