News August 19, 2025
యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నరోత్తం రెడ్డి

యాదాద్రి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా బీబీనగర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన గూడూరు నరోత్తం రెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్ మంగళవారం ప్రకటించారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర, జిల్లా నాయకులకు ధన్యవాదాలు నరోత్తం రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడతానని, రాబోయే స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు.
Similar News
News August 19, 2025
‘ఇంకాసేపే’ అనుకొంటూ రీల్స్ చూస్తున్నారా?

‘ఇంకాసేపే’ అని రీల్స్ చూస్తాం.. కానీ అది గంటల సమయాన్ని మింగేస్తుంది. అతిగా రీల్స్, షార్ట్స్ చూడటం ప్రమాదమని టియాంజిన్ నార్మల్ యూనివర్సిటీ(చైనా) తేల్చింది. ఇది మద్యం సేవించడం కంటే 5రెట్లు దుష్ప్రభావాలను చూపుతుందని పేర్కొంది. మెదడు సున్నితత్వాన్ని కోల్పోయి రోజూవారి కార్యకలాపాలను ఆనందించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుందట. స్థిరమైన ఆలోచన నుంచి మనల్ని తక్షణ సంతృప్తి వైపు మళ్లిస్తుందని తేల్చింది.
News August 19, 2025
MNCL: ‘నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు’

వినాయకచవితి, దుర్గాదేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఅండ్ ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించాలని, ఎత్తు విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News August 19, 2025
అగ్నివీర్ ర్యాలీలో విజయనగరం యువకుడి మృతి

కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా సంతకవిటి (M) శ్రీహరి నాయుడుపేటకు చెందిన జి.సాయి కిరణ్ (19) మంగళవారం 1600 మీటర్ల పరుగులో పాల్గొంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.