News April 4, 2025
యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
Similar News
News April 7, 2025
కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.
News April 7, 2025
ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.
News April 7, 2025
దుబాయ్‌లో అయిలాపూర్ వాసి మృతి

కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన గాజర్ల శ్రీనివాస్ గౌడ్ (55) ఆదివారం రాత్రి దుబాయ్‌లోని తన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. శ్రీనివాస్ ఐదేళ్లుగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.