News January 18, 2026

యాదాద్రి: తప్పని సరిగా హాజరు కావాలి: కలెక్టర్

image

పంచాయతీ శాఖ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని సర్పంచులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. నిర్ణీత తేదీల్లో సర్పంచులందరూ తప్పనిసరిగా హాజరై శిక్షణను విజయవంతం చేయాలని ఆదేశించారు. పాలనపై అవగాహన పెంచుకుని గ్రామాల్లో మెరుగైన సేవలందించేందుకే ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 14, 2026

HYD: అమ్మ కోసం.. చదువు పక్కనబెట్టి

image

మున్సిపాలిటీ రిజల్ట్స్‌లో చిత్ర విచిత్రాలు జరిగాయి. షాద్‌నగర్‌లో BRS అభ్యర్థులుగా 28వ వార్డు నుంచి లక్ష్మీప్రసన్న, 9వ వార్డు నుంచి ఆమె భర్త వేణుగోపాల్ పోటీ చేశారు. భార్య గెలవగా.. భర్త ఓడారు. ఇంజినీరింగ్, MBBS చదివే ఆమె పిల్లలే భుజానేసుకుని తల్లిని గెలిపించుకున్నారు. 22వ వార్డులో అనితను కుమార్తెలు, కుమారుడు గెలిపించారు. మాజీ ఛైర్మన్ నరేందర్ సతీమణి మహేశ్వరి ఓడిపోగా.. 23, 24లో వదిన మరిది గెలిచారు.

VZM: అప్పుడు కొడుకు.. ఇప్పుడు తండ్రి ఒకేలా మృతి

image

ఎనిమిది నెలల కిందట కుమారుడిని బలితీసుకోగా.. ఇప్పుడు తండ్రిని విధి పొట్టనబెట్టుకుంది. సారిపల్లికి చెందిన డ్రైవర్ శ్రీనివాసరావు (58) ఒడిశాలో జరిగిన <<19135875>>బస్సు <<>>ప్రమాదంలో మృతి చెందాడు. కాశీ యాత్రలో ఉండగా బస్సు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఆయన మరణించాడు. గతేడాది ఆయన కుమారుడు పురుషోత్తం కూడా కాశీ యాత్రలోనే డ్రైవర్‌గా ఉంటూ ప్రమాదంలో చనిపోయాడు. తండ్రీకొడుకులు ఒకేలా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.