News December 2, 2025

యాదాద్రి : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో నామినేషన్

image

కనిపించని దేవుడి కన్నా మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని పెద్దలంటుంటారు. ఇక ప్రతి బిడ్డ విజయం వెనుక వారు ఉంటారు. అయితే ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల తరుణంలో యాదాద్రి జిల్లా రామన్నపేట(మం) ఇంద్రపాలనగరానికి చెందిన గర్దాస్ విక్రమ్.. BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దానికి ముందు ఆయన వారి అమ్మనాన్నలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అతడిని పలువురు అభినందిస్తున్నారు.

Similar News

News December 3, 2025

గాన గంధర్వుడి విగ్రహంపై వివాదం.. మీరేమంటారు?

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును పలువురు <<18452414>>అడ్డుకోవడంపై<<>> నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్పీ బాలు ప్రాంతాలకు అతీతం అని, అలాంటి గొప్పవారి విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 3, 2025

అయ్యప్ప భక్తుల కోసం కాగజ్‌నగర్–కొల్లాం మధ్య ప్రత్యేక రైలు

image

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 13న కాగజ్‌నగర్ నుంచి కొల్లాం జంక్షన్ వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అభ్యర్థనపై ఈ రైలు ఏర్పాటైందని, అన్ని తరగతుల బోగీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మకరజ్యోతి దర్శనానికి కూడా ప్రత్యేక రైలు నడపాలని రైల్వే అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.

News December 3, 2025

కరీంనగర్: ఒత్తిళ్లకు ‘నై’.. సమరానికి ‘సై’..!

image

కరీంనగర్(R) మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. MA, LLB చదివిన ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వస్తున్న ఒత్తిళ్లను సైతం ఆమె లెక్కచేయకుండా సమరానికి సై అంటున్నారు.