News March 30, 2025
యాదాద్రి దేవస్థానం పంచాంగాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం పంచాంగాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పలువురు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు.
Similar News
News November 9, 2025
ఇతిహాసాలు – 61 సమాధానం

ప్రశ్న: యాదవ వంశం నశించాలని కృష్ణుడిని శపించింది ఎవరు? అలా శపించడానికి కారణాలేంటి?
జవాబు: కురుక్షేత్రంలో తన 100 మంది కుమారులు మరణించడంతో ఆ బాధ, కోపంతో శ్రీకృష్ణుడి యాదవ వంశం అంతమవ్వాలని గాంధారీ శపించింది. యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఆయన పాండవుల విజయానికి పరోక్షంగా కారణమయ్యాడని నిందిస్తూ.. యాదవ వంశం కలహాలతో నశించిపోతుందని, కృష్ణుడు ఒంటరిగా చనిపోతాడని శపించింది. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 9, 2025
వారంలో టెట్ నోటిఫికేషన్?

TG: టెట్ నిర్వహణ కోసం విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎంకు చేరింది. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది రెండో విడత నోటిఫికేషన్ కోసం అధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ప్రభుత్వ అనుమతి వస్తే వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. కాగా టీచర్లూ టెట్ పాసవడం తప్పనిసరి అయిన నేపథ్యంలో వారికి అవకాశం కల్పించేందుకు అర్హత నిబంధనల జీవోను సవరించాల్సి ఉంది.
News November 9, 2025
కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


