News September 14, 2025

యాదాద్రి, నల్గొండ జిల్లాలకు వర్ష సూచన

image

హైదరాబాద్ వాతావరణ కేంద్రం భువనగిరి, నల్గొండ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు, మూడు గంటల్లో యాదాద్రికి ఆరెంజ్ అలర్ట్, నల్గొండకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Similar News

News September 14, 2025

ఎచ్చెర్ల: రేపు అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్లు ఎంపిక

image

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్ల ఎంపిక సోమవారం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి. వనజ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది దేశ దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పేరేడ్‌లో పాల్గొనేందుకు ఎంపికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ యూత్ ఆఫీసర్ సైదా రమావత్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.

News September 14, 2025

వనపర్తి: జాతీయ లోక్ అదాలత్‌లో 2,737 కేసులు పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 2,737 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఇందులో ఐపీసీకి సంబంధించిన 171 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వెహికల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 514 కేసులు పరిష్కారమయ్యాయి. 2,007 ఈ-పెట్టీ కేసులు, 45 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి, బాధితుల ఖాతాల్లోకి రూ.15,10,698 తిరిగి జమ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

News September 14, 2025

జనగామలో సబ్-జూనియర్స్ కబడ్డీ ఎంపికలు

image

జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సబ్-జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు. చాగల్లు జడ్పీహెచ్ఎస్‌లో జరిగిన ఈ ఎంపికలకు 150 మంది బాలురు, 120 మంది బాలికలతో పాటు 30 మంది అఫీషియల్స్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేషన్ ఘన్‌పూర్ సీఐ వేణు క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.