News December 28, 2025
యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం యాదాద్రి, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు వలిగొండలో నూతన రోడ్డును ప్రారంభించి, అనంతరం సుంకిశాల ఆలయాన్ని సందర్శిస్తారు. వలిగొండలో సర్పంచుల సన్మాన సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మాడుగులపల్లిలో కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నల్గొండలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News December 30, 2025
HYD కుర్రాళ్ల ‘విష్ జార్’ మాయ

కోడింగ్ రాసి అలసిపోతున్న మన Gen-Z బ్యాచ్ కొత్త ట్రెండ్ అందుకుంది. 13-wish jar మంత్రం జపిస్తోంది. ఆఫీసు గొడవలు మర్చిపోవాలని చిట్టీలు రాసి తగలబెడుతున్నారు. లక్ష్యాలను మధ్యలోనే వదిలేస్తామని భయం ఉన్నా 43% మంది డిజిటల్ మాయ వద్దని ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ టైమ్ తగ్గించాలన్నది వీరి ప్లాన్. ట్రాఫిక్ జామ్ మధ్య స్లో లివింగ్ మజా వెతుక్కుంటున్నారు. సిటీ కుర్రాళ్లంతా రియల్ లైఫ్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు.
News December 30, 2025
యూరియా సరఫరాపై కలెక్టర్ సత్య శారద సమీక్ష

యూరియా సరఫరాపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలో యాసంగి 2025-26లో 1,12,345 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయన్నారు. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 14,375 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందజేశారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా సరఫరా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో నాలుగు సమస్యలకు పరిష్కారం

తిరుపతి పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ఇకపై తిరుపతి సర్కిల్ పర్యవేక్షణ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుందని సూపరింటెండింగ్ ఇంజినీర్ విన్నకోటి చంద్రశేఖర్ రావు తెలిపారు. వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత సమస్యలను నేరుగా తెలియజేసేందుకు 87126 52679 నంబర్‌కు చేయవచ్చన్నారు.


