News October 27, 2025
యాదాద్రి: ప్రభుత్వ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన

మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మించనున్న నూతన MRO, MPP కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం మెరుగైన వసతులతో కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి: నల్గొండ SP

ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 27, 2025
ప్రతిపక్షంలో BRS.. 97.4% తగ్గిపోయిన విరాళాలు

TG: అధికారం కోల్పోగానే BRSకు వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. ఈసీకి BRS సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2024–25లో రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాలుగా వచ్చాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి ₹5 కోట్లు అందాయి. 2023–24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కారు పార్టీకి రూ.580.52 కోట్లు రాగా ఈసారి ఏకంగా 97.4% తగ్గిపోవడం గమనార్హం.
News October 27, 2025
రెండో దశ SIR ఇలా..

* రెండో దశ <<18119730>>SIRలో<<>> భాగంగా 12 రాష్ట్రాలు, UTల్లో 51 కోట్ల ఓట్లను తనిఖీ చేయనున్నారు.
*5.33 లక్షల BLOలు, 7 లక్షల BLAలు పాల్గొంటారు. వీరికి ట్రైనింగ్ వెంటనే మొదలవుతుంది.
*నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 దాకా ఎన్యుమరేషన్ జరుగుతుంది. BLOలు ప్రతి ఇంటిని 3సార్లు విజిట్ చేస్తారు.
*డిసెంబర్ 8న డ్రాఫ్ట్ జాబితాలు ప్రచురిస్తారు. 2026 జనవరి 8 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రచురిస్తారు.


