News December 14, 2025
యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 93.11 శాతం నమోదవగా అత్యల్పంగా రామన్నపేట మండలంలో 90.58 శాతం నమోదైంది. భువనగిరి మండలంలో 93.08 శాతం, బీబీనగర్ మండలంలో 91.38 శాతం, వలిగొండ మండలంలో 91.24 శాతం నమోదైంది. మొత్తం 2,02,716 ఓట్లకు 1,85,937 ఓట్లు పోల్ అయ్యాయి.
Similar News
News December 17, 2025
అమ్మ రక్షిత కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగించాలి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలో ప్రసవ మరణాల నిర్మూలనకు అమలు పరుస్తున్న అమ్మ రక్షిత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అమ్మ రక్షిత కార్యక్రమం అమలుపై వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News December 17, 2025
గుండాలలో 1,344 ఓట్ల తేడాతో విజయం

గుండాల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు దేవనబోయిన ఐలయ్య 1,344 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కోన్నారు. దీంతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
News December 17, 2025
వెయ్యి ఓట్ల మెజారిటీతో కాళేశ్వరంలో బీఆర్ఎస్ గెలుపు

మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం మేజర్ పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి గెలుపొందారు. సుమారు వెయ్యికి పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధికార కాంగ్రెస్‌కి సగం ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం.


