News January 26, 2026
యాదాద్రి: మున్సిపల్ పోరు.. వైస్ ఛైర్‌పర్సన్ పదవిపై నేతల గురి

మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఛైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్లు అడ్డంకిగా మారిన కొందరు నేతలు వైస్ ఛైర్‌పర్సన్ పీఠంపై కన్నేశారు. కౌన్సిలర్‌గా గెలవడమే కాకుండా, తమ వర్గం వారిని మెజారిటీ స్థానాల్లో గెలిపించుకుని పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. వైస్ ఛైర్‌పర్సన్లు సైతం కీలక నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఈ పదవికి రాజకీయ వర్గాల్లో డిమాండ్ పెరిగింది.
Similar News
News February 9, 2026
శాంతియుత ఎన్నికల కోసం సెక్షన్ 163 అమలు: CP

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు, అలాగే కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. నలుగురికి మించి గుంపులు, ఊరేగింపులు, ఆయుధాలతో సంచారం నిషేధమని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 9, 2026
సత్యసాయి: ‘అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి’

పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా త్వరితగతిన పరిష్కరించాలని సత్యసాయి జిల్లా JC మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. మొత్తం 293 అర్జీలురాగా వాటిపై తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు.
News February 9, 2026
పల్నాడు: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 3వ మంత్రులు-కార్యదర్శుల సదస్సుకు పల్నాడు జిల్లా యంత్రాంగం హాజరైంది. నరసరావుపేట కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనను వేగవంతం చేయడం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వ పథకాల అమలుపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.


