News January 26, 2026
యాదాద్రి: మున్సిపల్ పోరు.. వైస్ ఛైర్‌పర్సన్ పదవిపై నేతల గురి

మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఛైర్‌పర్సన్ పదవికి రిజర్వేషన్లు అడ్డంకిగా మారిన కొందరు నేతలు వైస్ ఛైర్‌పర్సన్ పీఠంపై కన్నేశారు. కౌన్సిలర్‌గా గెలవడమే కాకుండా, తమ వర్గం వారిని మెజారిటీ స్థానాల్లో గెలిపించుకుని పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు. వైస్ ఛైర్‌పర్సన్లు సైతం కీలక నిర్ణయాల్లో ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఈ పదవికి రాజకీయ వర్గాల్లో డిమాండ్ పెరిగింది.
Similar News
News February 11, 2026
జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
News February 11, 2026
Peoples Pulse.. ఉమ్మడి మెదక్ ఎగ్జిట్ పోల్స్ ఇవే!

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలకు సంబంధించి 403 వార్డుల్లో జరిగిన ఎలక్షన్స్‌పై పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ 166-174 వార్డులు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. BRS 172-180, BJP 35-42, MIM 2-4, ఇతరులు 8- 12 వార్డులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 13న తుది ఫలితాలు. 16న ఛైర్మన్ల ఎన్నిక.
News February 11, 2026
151 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)151 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిప్లొమా, ఇంటర్, టెన్త్, ITI అర్హత గలవారు నేటి నుంచి FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.21,000-23,000తో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: https://hal-india.co.in


