News January 29, 2026
యాదాద్రి మున్సిపల్ బరిలో లోక్‌దళ్ పూర్తి పోటీ

చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ పోటీ చేస్తుందని జిల్లా అధ్యక్షుడు బీరప్ప తెలిపారు. బుధవారం చౌటుప్పల్‌లో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల రాజకీయ సాధికారతే లక్ష్యమని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
Similar News
News February 10, 2026
HYD: జ్యోతిర్లింగాల దర్శనం.. FEB 21 నుంచి షురూ

దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగాల దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాలను దర్శంచుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. పెద్దలకు రూ.14,700లు, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800ల టికెట్ ధరను అధికారులు నిర్ణయించారు. SHARE IT.

తప్పులు సరిదిద్దేందుకు రీసర్వే 2.0: కలెక్టర్

జిల్లాలో రీసర్వే 2.0ను నిర్వహించడానికి మండలాల వారీగా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారం, శాశ్వత భూ హక్కుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రీసర్వేలో దొర్లిన తప్పులు సరిదిద్దేందుకు రీసర్వే 2.0ను తీసుకొచ్చిందన్నారు.